కృష్ణాజిల్లా చల్లపల్లి నిమ్మలతోటలోని శ్రీ హరి హరపుత్ర అయ్యప్పస్వామి క్షేత్రం ఆధ్వర్యంలో 13 రోజుల పాటు అన్నదానం చేస్తున్నారు. కరోనా విధులు నిర్వహిస్తున్న పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, అనాధలు, యాచకులకు ప్రతిరోజూ సుమారు 200 మందికి భోజనాలు అందిస్తున్నారు. దేవాలయ ఆవరణలో వంట చేయించి ప్యాకెట్లతో కమిటీ ప్రతినిధులే స్వయంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి భోజనాలు అందించే ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ధర్మకర్త అన్నవరపు పాండురంగారావు తెలిపారు.
లాక్ డౌన్లో పేదలకు నిత్యం అన్నదానం - corona news in krisna dst
కరోనా కట్టడి కోసం విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు, ఆర్టీసీ సిబ్బందికి కృష్ణాజిల్లా చల్లపల్లి మండలంలో హరిహరపుత్ర అయ్యప్పస్వామి క్షేత్రం ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.
పేదలకు ఆహారం పంపిణీ