'వరద నీరు వచ్చి ఇబ్బందులు పడుతున్నాం... ఆదుకోండి' విజయవాడ రామలింగేశ్వరంలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణా నది వరద నుంచి కరకట్ట వాసులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు వ్యయంతో రిటైనింగ్ వాల్ నిర్మించింది. అయినా ప్రజలకు మాత్రం వరద కష్టాలు తప్పడం లేదు. డ్రైనేజీ లీకుల వల్ల నీరు ఇళ్లలోకి వస్తోంది. వరద నీరు రాకుండా అధికారులు ఇసుక బస్తాలు వేయించినా ఫలితం లేకపోతోంది. నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మోటార్‌తో తోడిస్తున్నారు. వరద తగ్గినా ఇంత వరకూ అధికారులు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: