ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక - krishna riverlatest updates

కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నదిలో ప్రవాహం పెరగడం వల్ల ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు.. దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వరద ప్రభావిత మండలాల అధికారులను జిల్లా కలెక్టర్​ అప్రమత్తం చేశారు.

floods increased in Krishna river at Prakasam Barrage in Krishna district
కృష్ణానదిలో వరద ఉద్ధృతి... మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

By

Published : Sep 27, 2020, 7:11 PM IST

కృష్ణానదికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు.. దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఫలింతగా బ్యారేజీ దిగువ ప్రాంతాలకు పెద్దఎత్తున వరదనీరు వచ్చి చేరుతోంది. కృష్ణానది పరివాహకంలోని యనమలకుదురు, పెదపులిపాక, కేసరనేనివారిపాలెం, మద్దూరు ప్రాంతాల్లో పంటపొలాలు జలమయమయ్యాయి.

నదికి సమీపంలోని నివాసాలు, ఆలయాల్లోకి కూడా వరద నీరు చేరింది. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్​ సూచించారు. వరద ప్రభావిత మండలాల అధికారులను కలెక్టర్​ అప్రమత్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details