ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మున్నేరు ఉగ్రరూపం...అప్రమత్తమైన అధికారులు

By

Published : Aug 21, 2020, 2:50 PM IST

భారీ వర్షాలకు మున్నేరు నదికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. కృష్ణా జిల్లాలోని మున్నేరు పరివాహక ప్రాంతాలు చాలా వరకు నీట మునిగాయి.

floods in munneru river
మున్నేరుకు వరద

కృష్ణా జిల్లా నందిగామ వద్ద మున్నేరు పరవళ్లు తొక్కుతుంది. తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు వరద భారీగా వస్తోంది. వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు మండలాల పరిధిలో మున్నేరు ఒడ్డున వున్న ఆయకట్టులో వరి పైరులు నీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్ట పోయారు. పెనుగంచిప్రోలు వద్ద వంతెన పైనుంచి వరద నీరు పారుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు రాకపోకలు నిలిపేశారు. నది ఒడ్డున ఉన్న శ్రీ తిరుపతమ్మ దేవాలయ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది.

మున్నేరులో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. కృష్ణా జిల్లా పొలంపల్లి వద్ద 15 అడుగుల నీటిమట్టం, దిగువన 1.20 లక్షల క్యూసెక్కుల నీరు చేరింది. మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్న తాగునీటి పథకాలు నీటిలో మునిగాయి. వత్సవాయి మండలంలో 15 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచింది.

ఇవీ చదవండి:గోదావరిని వదలని వరద.. ఇంకా జలజీవనంలోనే బాధితులు

ABOUT THE AUTHOR

...view details