ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం బ్యారేజికి భారీగా వరద.. అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్లు - Prakasam Barrage flood waters news

కృష్ణా జిల్లాలోని ప్రకాశం బ్యారేజికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజికి ఇన్​ ఫ్లో 58,439 క్యూసెక్కులు ఉండగా... ఔట్‌ ఫ్లో 48,750 క్యూసెక్కులుగా ఉంది. వరద ప్రవాహం పెరుగుతున్న దృష్ట్యా అధికారులను కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తం చేశారు.

Prakasam Barrage
ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద

By

Published : Aug 5, 2021, 3:45 PM IST

కృష్ణా జిల్లాలోని ప్రకాశం బ్యారేజికి ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి 58,439 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోందని జల వనరుల శాఖ వెల్లడించింది. దాంతో బ్యారేజి గేట్లు ఎత్తి అధికారులు 48,750 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో వైపు.. ఎగువన ఉన్న గుంటూరు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో 1.13 లక్షల క్యూసెక్కులు ఉండగా... ఔట్ ఫ్లో 4.51లక్షల క్యూసెక్కులుగా ఉంది.

అప్రమత్తమైన కలెక్టర్లు..

పెరుగుతున్న వరద ప్రవాహం దృష్ట్యా అధికారులను కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తం చేశారు. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లతో నదిలో ప్రయాణించ వద్దని హెచ్చరికలు జారీ చేశారు. వరద నీటిలో ఈతకు, స్నానాలకు వెళ్లవద్దని హెచ్చరించారు. వరద ప్రవాహం పెరుగుతున్నందున ప్రజలు వాగులు, కాలువలు దాటే ప్రయత్నాలు చేయవద్దని కోరారు.

ఇదీ చదవండి:

విరిగిన పులిచింతల ప్రాజెక్టు గేటు.. లక్ష క్యూసెక్కుల నీరు వృథా

ABOUT THE AUTHOR

...view details