ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామాల్లోకి వస్తున్న వరద నీరు..ఆందోళనలో ప్రజలు - flood water entered into villages

రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా నదుల్లో ప్రవాహం ఎక్కువగా ఉంది. పలుచోట్ల చెరువులు కట్టలు తెంచుకుని ప్రవహిస్తున్నాయి. కృష్ణాజిల్లా మోపిదేవి మండలం ఉత్తర చిరువోలులంక పక్కన కరకట్ట లాకుల ద్వారా వరద నీరు గ్రామాల్లోకి వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

flood water entering into villages
గ్రామాల్లోకి ప్రవహిస్తున్న వరద నీరు

By

Published : Oct 15, 2020, 12:21 PM IST

కృష్ణాజిల్లా ఉత్తర చిరువోలులంక దగ్గర కరకట్ట లాకుల ద్వారా వరద ప్రవాహం గ్రామాల వైపు ప్రవహిస్తోంది. వేల క్యూసెక్యుల నీరు వస్తుండటంతో ఇప్పటికే వందలాది ఎకరాల పంట పొలాలు మునిగిపోయాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత నష్టం జరిగే ప్రమాదముందని గ్రామస్థులు వాపోతున్నారు.

కోసురువారిపాలెం, మెళ్ళమర్తిలంక ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు. లాకుల వద్ద వరద ప్రవాహాన్ని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: వంతెన శిథిలావస్థకు చేరింది పటిష్ట వారథి నిర్మించరూ..

ABOUT THE AUTHOR

...view details