కృష్ణాజిల్లాలో విస్తారంగా వానలు పడుతున్నాయి. తిరువూరుతోపాటు పరిసర గ్రామాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి కార్యాలయంలో వరద నీరు చేరింది. దాదాపు ఒక అడుగు మేర ఉన్న నీటిలోనే ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది పనిచేస్తున్నారు.
తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు చాట్రాయి మండలంలో తమ్మిలేరు జలాశయానికి వరద నీరు వస్తోంది.