ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం బ్యారేజీకి 2 లక్షల 70 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. 3 లక్షల 19 వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుస్తున్నట్టు వివరించారు. కాలువలకు దాదాపు 7వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
ప్రకాశం బ్యారేజీకి వరద... దిగువకు భారీగా నీటి విడుదల
ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద నీరు ఎక్కువ కావటంతో.. బ్యారేజీ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నామనీ, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రకాశం బ్యారేజీకి వరద
మున్నేరు, కట్లేరు, వైరా వాగుల నుంచి పెద్ద ఎత్తున బ్యారేజీకి వరద నీరు వస్తున్నట్లు వెల్లడించారు. బ్యారేజీ అన్ని గేట్లను ఎత్తి.. సముద్రంలోకి వదులుతున్నట్లు స్పష్టం చేశారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి 2 లక్షల 57 వేల క్యూసెక్కులు, మున్నేరు నుంచి 12 వేల 374 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు వివరించారు. వరదల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి:ఆశ చూపి డబ్బు వసూలు చేశారు...అడిగితే ముఖం చాటేశారు!