ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మున్నేరుకు మళ్లీ పెరిగిన వరద - paleru flood update

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు.. మున్నేరు, పాలేరు వాగుల్లో మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. మరో ఒక్క అడుగు నీటిమట్టం పెరిగితే.. లింగాల వంతెనపై నుంచి వరద ప్రవహించే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు.

munner flood
మున్నేరు వరద ప్రవాహం

By

Published : Sep 26, 2020, 3:15 PM IST

తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు రాష్ట్ర పరిధిలోని మున్నేరు, పాలేరు వాగుల్లో వరద ప్రవాహం పెరుగుతోంది. కృష్ణా జిల్లా వత్సవాయి మండంల పోలంపల్లి ఆనకట్ట వద్ద 11 అడుగుల నీటిమట్టం కొనసాగుతుండగా.. దిగువకు 25 వేల క్యుసెక్కుల వరద ప్రవహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆనకట్ట వద్ద మరో అడుగు నీటి మట్టం పెరిగితే, లింగాల వంతెనపై నుంచి వరద ప్రవహించే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు.

ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్న కారణంగా.. నీటి ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. జగ్గయ్యపేట పట్టణానికి ఎగువన ప్రవహిస్తున్న పాలేరు వాగులో వరద ప్రవాహం పెరిగిన ఫలితంగా.. తక్కెళ్లపాడు వద్ద వరిపొలాలు నీట మునిగాయి. ప్రవాహం ఇలాగే కొనసాగితే.. వరి పంట నాశనమయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details