ఎవరైనా రాకపోతారా..ముంపు బాధితుల నిరీక్షణ! - floods
కృష్ణానదికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. పులిచింతల నుంచి దాదాపు 5 లక్షల క్యూసెక్కుల నీటిని వదలడంతో...ప్రకాశం బ్యారేజీ నుంచి గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నుంచి నీటి విడుదలతో సమీప ప్రాంతాలైన కృష్ణలంక, రాణిగారితోట, తారకరామనగర్, కోటి నగర్, పోలీస్ కాలనీ ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ముంపు దృష్ట్యా మంగళవారమే జిల్లా కలెక్టర్, పలువురు అధికారులు ముందుగానే ఈ ప్రాంత వాసులను ఖాళీ చేయాలని చెప్పారు. పునరావాస కేంద్రాలు సరిపోవడం లేదని, కృష్ణానది కరకట్టపైనే సామాన్లు పెట్టుకుని ఉండాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి నుంచి విద్యుత్, తాగేందుకు మంచి నీళ్లు సైతం లేకుండా ఎవరైనా రాకపోతారా అంటూ నిరీక్షిస్తున్నామని వాపోతున్నారు. కృష్ణలంక ప్రాంత పరిస్థితిపై మరిన్ని వివరాలు ఈటీవీ-భారత్ ప్రతినిధి వివరిస్తారు.
flood_problems_in_andhrapradesh
.