ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బాబు రావాలి... వంతెన నిర్మించాలి' - Flood flow on Vinagadapa bridge

కృష్ణా జిల్లాలోని విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే మార్గంలో వినగడప సమీపాన నిర్మించిన తాత్కాలిక వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. ఈ ప్రదేశాన్ని స్థానిక తెదేపా నాయకులు పరిశీలించారు. బాబు రావాలి... వంతెన నిర్మించాలి అని నినాదాలు చేశారు.

tdp leaders
తెదేపా నాయకులు

By

Published : Jul 14, 2021, 4:34 PM IST

కృష్ణా జిల్లాలోని కట్టలేరులో వరద పోటెత్తింది. గంపలగూడెం మండలం వినగడప సమీపంలో నిర్మించిన తాత్కాలిక వంతెనపై నుంచి వరదనీరు ప్రవహిస్తోంది. ఆ మార్గంలో విజయవాడ - మచిలీపట్నం వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కూలిన వంతెనను స్థానిక తెదేపా నాయకులు పరిశీలించారు. బాబు రావాలి.. వంతెన నిర్మించాలని నినాదాలు చేశారు.

మూడేళ్ల క్రితం భారీ వరద తాకిడికి ఇక్కడ వంతెన కూలి పోగా.. తాత్కాలిక వంతెనను నిర్మించారు. శాశ్వత వంతెన నిర్మించక పోవటం... తాత్కాలిక వంతెనకు తరచూ గండ్లు పడటం వల్ల అటుగా వెళ్లే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details