ప్రకాశం బ్యారేజీలో వరద నీరు క్రమేపి తగ్గుతోంది. ప్రస్తుతం బ్యారేజీ దిగువకు 5 లక్షల91వేల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 5 లక్షల 77వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువన పులిచింతల నుంచి వరద నీరు వస్తుండటంతో ఆ నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాలువలకు 7 వేల932 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రకాశం బ్యారేజీ నుంచి 578 టీఎంసీల నీరు సముద్రంలోకి వదిలినట్లు అధికారులు తెలిపారు. క్రమేనా ఈరోజు సాయంత్రానికి వరద ప్రవాహం మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రకాశం బ్యారేజీకి తగ్గుతున్న వరద ప్రవాహం - ప్రకాశం బ్యారేజీకి తాజా వార్తలు
ఎగువన పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తుండటంతో అధికారులు అంతే నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. అయితే ఈరోజు సాయంత్రానికి వరద తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.
ప్రకాశం బ్యారేజీకి తగ్గుతున్న వరద ప్రవాహం