జగ్గయ్యపేట కృష్ణా తీర గ్రామాల్లో వరద ఉద్ధృతి స్వల్పంగా తగ్గినట్లు కనిపిస్తోంది. ఉదయానికి వరద నీరు 2 అడుగులు మేర తగ్గింది. ముక్త్యాల, వేదాద్రి, రావిరాల గ్రామాల్లో రోడ్లపైకి వచ్చిన వరద నీటిలోనే ప్రజలు పడవల్లో ప్రయాణం చేశారు. రెవెన్యు అధికార్లు, స్థానిక నేతలుతో పాటు యువత స్వచ్ఛందంగా వరద నివారణ చర్యల్లో పాల్గొని, బాధిత కుటుంబాలకు ఆహార పొట్లాలను అందించే ప్రయత్నం చేస్తున్నారు.
జగ్గయ్యపేటలో శాంతించిన కృష్ణమ్మ - కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం
జగ్గయ్యపేట మండలంలో శాంతించిన కృష్ణమ్మ. ఊపిరి పీల్చుకున్న తీర ప్రాంత గ్రామాల ప్రజలు.
జగ్గయ్యపేటలో శాంతించిన కృష్ణమ్మ...బాధితులకు ఆహారం పంపిణీ