ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరామర్శించేందుకు ఒక్క నాయకుడు రాలేదు: వరద బాధితులు - విజయవాడ వరదలు లేటెస్ట్ న్యూస్

భారీగా కురుస్తున్న వర్షాలకు విజయవాడలోని ప్రకాశం బ్యారేజీలోకి పెద్ద ఎత్తున వరద పోటెత్తుతోంది. బ్యారేజీ 70 గేట్లు ఎత్తి కిందకు 7 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో విజయవాడ దిగువన పలు ప్రాంతాలు నీట మునిగాయి. రాత్రికి రాత్రే వరద పోటెత్తిందనీ... అధికారులు ఎవరూ తమను పట్టించుకోవటం లేదని వరద బాధితులు వాపోయారు. తాగేందుకు మంచినీరు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

flood in vijayawada
విజయవాడలో వర్ష ప్రభావం

By

Published : Oct 14, 2020, 7:26 PM IST

విజయవాడలో వర్ష ప్రభావం

ప్రకాశం బ్యారేజీకి వరద భారీగా పెరగటంతో... 70 గేట్లు ఎత్తి కిందకు 7 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో విజయవాడలో దిగువన ఉన్న రాణిగారితోట, కృష్ణలంక, రామలింగేశ్వర్ నగర్, రణవీర్ నగర్, బాలాజీ నగర్, యనమల కుదురు, తదితర ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. రాత్రికి రాత్రే వరద ఇళ్లల్లోకి వచ్చేసిందనీ... సామాన్లు సర్దుకునే లోపే ధాన్యం, సహా పలు వస్తువులు తడిసి ముద్దయ్యాయనీ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

వరుసగా కృష్ణా నదికి వరద వస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. వరద ముంచెత్తి బాధపడుతున్న తమను పరామర్శించేందుకు ఒక్క నాయకుడైనా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరద వచ్చిన ప్రతిసారి పరిహారం వస్తుందని చెప్తారనీ.. చివరకు వచ్చేసరికి మునుగుతున్నామన్నారు. పరామర్శించాల్సిన వారే ఇప్పుడు బెదిరిస్తున్నారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details