పొగమంచు వల్ల గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాలు ఆలస్యంగా ల్యాండ్ అయ్యాయి. ఉదయం 7గంటల 20 నిమిషాలకు విజయవాడ చేరుకోవాల్సిన దిల్లీ, బెంగళూరు విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. పొగమంచు కారణంగా.......రన్‌వేపై ఏమీ కనిపించకపోవడం వల్ల స్పైస్‌జెట్,ఇండిగో విమానాలు గాలిలో చక్కర్లు కొట్టాయి. ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. అరగంట అనంతరం రన్‌వేపై ల్యాండ్ అయ్యాయి.
గన్నవరం వద్ద పొగమంచు.. విమానాల రాకపోకలు ఆలస్యం... - heavy fog at gannavaram airport update
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పొగమంచు అధికంగా ఉండటంతో.. విమానాలు ఆలస్యంగా ల్యాండ్ అయ్యాయి. దీనివల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు.
గన్నవరం విమానాశ్రయం వద్ద పొగమంచు