ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పనులు లేకుండా పోయాయి.. మమ్మల్ని ఆదుకోండి' - విజయవాడ ఫ్లెక్స్ ప్రింటింగ్ వర్కర్స్ వార్తలు

కరోనా మహమ్మారి కారణంగా తమకు పనులు లేకుండా పోయాయని.. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ఫ్లెక్స్ ప్రింటింగ్ అసోసియేషన్ సభ్యులు. లాక్​డౌన్​తో పనుల్లేక దాదాపు 3 నెలల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. తిరిగి పనులు ప్రారంభించేందుకు తమకు రుణ సదుపాయం కల్పించాలి విజ్ఞప్తి చేశారు.

flex printing workers facing trobles due to corona lock down in vijayawada
ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్

By

Published : Jun 5, 2020, 1:42 PM IST

కరోనా లాక్​డౌన్ కారణంగా ఫ్లెక్సీ మరియు యాడ్స్ వ్యాపారాలు సంక్షోభంలో కూరుకుపోయాయని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఫ్లెక్స్ ప్రింటింగ్ అసోసియేషన్ సభ్యులు కోరారు. ఫ్లెక్స్ ప్రింటింగ్​తో స్వయం ఉపాధి పొందుతున్న తమను కరోనా దారుణంగా దెబ్బతీసిందని వారు విజయవాడలో ఆవేదన వ్యక్తం చేశారు. లాక్ డౌన్​తో కొన్ని వేల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు.

అద్దెలు కట్టలేక, కరెంట్ బిల్లులు, వర్కర్స్ జీతాలు, మెయింట్​నెన్స్ ఖర్చులు, కుటుంబ పోషణకు డబ్బుల్లేక ఎన్నో రకాలుగా అవస్థలు పడుతున్నామని వాపోయారు. ఇన్నాళ్లు పని లేకపోవడం వలన యంత్రాలు పని చేయడం లేదని.. తిరిగి పని ప్రారంభించాలంటే లక్షల్లో ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లెక్స్ ప్రింటింగ్​ను చిన్న తరహా పరిశ్రమగా గుర్తించి రుణ సదుపాయం కల్పించాలని కోరారు.

ఇవీ చదవండి.. చాకచక్యంతో యువతి ఆత్మహత్యను ఆపిన పోలీసులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details