రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలులో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలు పేరుతో భూసేకరణ చేస్తోంది. ఈ మేరకు కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం పినపాక గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పొలంలో... సర్వే పేరిట అధికారులు జెండాలు పాతారు. కంగారుపడిన రైతు... తమ భూమిని అన్యాయంగా లాక్కుంటున్నారని వాపోయాడు. చదును చేయడానికి వచ్చిన డోజర్ని కుటుంబసభ్యులతో కలిసి అడ్డగించాడు. తమకు జీవనాధారం ఆ భూమేనని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇళ్ల స్థలాల సేకరణకు రైతు భూమిలో జెండాలు - కృష్ణా జిల్లాలో ఇళ్ల స్థలాల సేకరణ వార్తలు
కృష్ణా జిల్లా పినపాక గ్రామానికి చెందిన రైతు పొలంలో ఇళ్ల స్థలాల కోసం అధికారులు జెండాలు పాతారు. ఇళ్ల స్థలాల పేరుతో తన భూమిని లాక్కుంటున్నారని రైతు వాపోయాడు. చదును చేయడానికి వచ్చిన డోజర్ని కుటుంబసభ్యులతో కలిసి అడ్డగించాడు.

కృష్ణా జిల్లా పినపాక గ్రామంలో ఇళ్ల స్థలాల సేకరణలో అవకతవకలు