ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల నియమాలను అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాలి: పోలీసులు - విజయవాడవార్తలు

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కృష్ణా జిల్లా విజయవాడ టూ టౌన్ కొత్తపేట పోలీస్​స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల నియమాలను అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాలని కోరుతూ మైక్​లో ప్రచారం చేశారు. పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని సయ్యద్ అప్పల స్వామి కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసరావు పరిశీలించారు.

Flag March
ఫ్లాగ్ మార్చ్

By

Published : Mar 2, 2021, 7:44 PM IST

విజయవాడ టూ టౌన్ కొత్తపేట పోలీస్​స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ నెల 10న నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు శాంతిభద్రత చర్యలు చేపట్టారు. ప్రత్యేక పోలీసు దళాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల నియమాలను అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాలని కోరుతూ మైక్​లో ప్రచారం చేశారు.

ఏర్పాట్లపై నగర పోలీస్ కమిషనర్ ఆరా..

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని సయ్యద్ అప్పల స్వామి కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసరావు పరిశీలించారు. కళాశాల ప్రాంగణంలో అధికారులు చేసిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చదవండి:మేనిఫెస్టో తప్పక పాటిస్తామన్న తెదేపా నేతలు

ABOUT THE AUTHOR

...view details