కృష్ణా జిల్లా చల్లపల్లిని 'సుందర చల్లపల్లిగా' తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 'మన కోసం మనం' అనే స్వచ్ఛంద సంస్థ చేపట్టిన దీక్ష ఐదేళ్లకు చేరుకున్న సందర్భంగా వేడుకలు నిర్వహించారు. 2014 నవంబర్ 12న చేపట్టిన దీక్ష నిర్విరామంగా కొనసాగుతోందని కార్యక్రమ రూపకర్త డీఆర్కే ప్రసాద్ తెలిపారు. విరాళాల సాయంతో.. దీక్షలో పాల్గొన్న స్వచ్ఛసైనికుల సహకారంతో గ్రామంలోని ప్రజలను చైతన్యపరుస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సినీ గేయ రచయిత చంద్రబోస్, హైదరాబాద్ సన్షైన్ ఆసుపత్రుల అధినేత గురవారెడ్డి, అవనిగడ్డ ఎమ్మెల్యే తదితరులు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత కోసం మేము సైతం అంటూ గ్రామాన్ని స్వచ్ఛ చల్లపల్లిగా తీర్చిదిద్దారని చంద్రబోస్ కొనియాడారు. స్వచ్ఛసైనికులను అభినందించారు.
'సుందర చల్లపల్లికి' ఐదేళ్లు.. ఘనంగా వేడుకలు - స్వచ్ఛ చల్లపల్లి వార్తలు
కృష్ణా జిల్లా చల్లపల్లిని 'సుందర చల్లపల్లిగా' తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 2014 నవంబర్ 12న చేపట్టిన దీక్ష ఐదేళ్లకు చేరుకున్న సందర్భంగా వేడుకలు నిర్వహించారు.
'సుందర చల్లపల్లికి' ఐదేళ్లు.. ఘనంగా వేడుకలు