కృష్ణా జిల్లా నూజివీడు మండలంలో లారీ, కారును ఢీకొన్న ఘటనలో ఐదుగురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. మహారాష్ట్ర నుంచి దానిమ్మ పండ్ల లోడుతో వస్తున్న లారీ, చింతలపూడి నుంచి వస్తున్న కారును హనుమంతుల గూడెం వద్ద ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.