విజయనగరం జిల్లా పార్వతీపురంలోని రెల్లివీధిలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానితుల ఇళ్లల్లో సోదాలు చేసి, 650 లీటర్ల నాటుసారాను పట్టుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి పత్రాలు లేని 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై కళాధర్ తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పార్వతీపురంలో 650 లీటర్ల నాటుసారా పట్టివేత.. ఐదుగురు అరెస్ట్ - నాటు సారా ఏరివేత
నాటు సారా ఏరివేత లక్ష్యంగా పార్వతీపురం పట్టణంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. వేకువజామున చేసిన ఈ దాడిలో, 650 లీటర్ల నాటుసారా పట్టుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు.

పార్వతీపురంలో నాటుసారా పట్టివేత