లక్కీ డ్రా పేరిట అమాయక ప్రజలకు టోపీ వేస్తున్న ఐదుగురు వ్యక్తులను కృష్ణా జిల్లా విస్సన్నపేట పోలీసులు అరెస్ట్ చేశారు. విస్సన్నపేటలో శ్రీవిజ్ఞేశ్వర లక్కీ డ్రా పేరిట 22 స్కీమ్ లతో 140 మందిని మోసం చేసినట్లు నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
వీరు తిరువూరు, గంపలగూడెం, విస్సన్నపేట, బాపులపాడు చాట్రాయి రెడ్డిగూడెం, వేంసూరు, సత్తుపల్లి మండలాల్లో లక్కీడ్రా పేరిట మోసాలకు పాల్పడ్డారని డీఎస్పీ వివరించారు. శిలపురెడ్డి రాంమొహన్‌రెడ్డి, మురళి మెహన్ రెడ్డి, కుక్కడపు లక్ష్మీనారాయణ, పానుగంటి అంజిబాబు, విస్సంపల్లి శ్రీరాములు అనే నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారి నుంచి 18 లక్షల 40 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.