కృష్ణా జిల్లా చందర్లపాడులో శుక్రవారం పిచ్చికుక్క స్వైరవిహారం చేసి ఐదుగురిని గాయపరిచింది. ఉన్నత పాఠశాలను శుభ్రం చేస్తున్న వాచ్మెన్పై దాడి చేసింది. ఆయన కేకలు వేశారు. అక్కడే ఉన్న కొందరు కుక్కను తరమడానికి వెళ్లగా వారిలో మరో ఇద్దరిని కరిచింది.
గ్రామస్థులు పొలాల్లోకి తరమగా అక్కడ కూడా... మరో ఇద్దరిని గాయపరిచింది. గాయపడిన ఐదుగురిని చికిత్స కోసం స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అధికారులు స్పందించి శునకాలను అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టాలని స్థానికులు కోరుతున్నారు.