చేపల ధరను తగ్గించాలని అడిగినందుకు.. ఇద్దరిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు విక్రయదారుడు. ఈ ఘటన కృష్ణాజిల్లా గుడివాడలో జరిగింది. బంటుమిల్లి రోడ్డులోని శివ చేపల దుకాణంలో.. మహమ్మద్ రబ్బానీ చేపలు కొనుగోలు చేశాడు. కొన్న చేపల్లో అర కిలోకిపైగా జన రావడంతో ధర తగ్గించమని రబ్బాని అడిగాడు. దీంతో.. మాటా మాటా పెరిగి ఆవేశానికి లోనైన చేపల దుకాణ యజమాని శివ.. రబ్బానీపై దాడి చేశాడు.
చేపల ధర తగ్గించాలని అడిగితే.. కత్తితో పొడిచేశాడు!
మనుషుల్లో ఓ కృూరత్వపు లక్షణాలు పెరిగిపోతున్నాయి.. చిన్న చిన్న వాటికే గొడవలు పడుతున్నారు.. క్షణికావేశంలో దాడులు చేసుకుంటున్నారు.. కత్తులు దూస్తూ నెత్తురు కళ్ల చూస్తున్నారు..! తాజాగా చేపల ధరలో తలెత్తిన చిన్న వివాదం ఏకంగా కత్తితో దాడి చేసేవరకు వెళ్లింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..?
ఈ విషయం తెలుసుకొన్న రబ్బానీ కుటుంబ సభ్యులు రఫీ, రసూల్ వచ్చి.. ఇదేం పద్ధతని ప్రశ్నించారు. దీంతో పట్టరాని ఆగ్రహంతో.. చేపల దుకాణ యజమాని శివ, తన కుమారుడితో కలిసి రఫీ, రసూల్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో రసూల్ గొంతుపై తీవ్రగాయాలు కాగా.. రఫీ చేతులు తెగిపోయాయి. బాధితులను గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం విజయవాడ తరలించారు. కేసు నమోదు చేసిన గుడివాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: