ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పర్యటకులకు మేం రక్ష... మాకు రక్ష ఎవరు? - హంసలదీవి తాజా వార్తలు

మత్స్యకారులకు సముద్రమే జీవనాధారం! ఆ కడలి ఆటుపోట్లకు తట్టుకుంటూ వారు కాపాడిన ప్రాణాలెన్నో! సముద్రం లోతెంతున్నా... ప్రాణాలు పణంగా పెట్టి తోటి మనుషులను కాపాడటంలో వాళ్లకి సాటి ఎవ్వరుండరూ! తీరానికి వచ్చే పర్యటకులను రక్షించడంలో ఒకడుగు ముందుండి సహాయం చేస్తే... వారి ప్రాణాలు మాత్రం పట్టించుకున్నావారే నాథులే ఉండరు.

పాలకాయతిప్పలో మత్స్యకారులు

By

Published : Nov 21, 2019, 2:45 PM IST


కృష్ణాజిల్లా, కోడూరు మండలం కృష్ణావన్యప్రాణి అభయరణ్య పరిధిలో ఉన్న పాలకాయతిప్ప తీరానికి వందల మంది పర్యటకులు వస్తుంటారు. మడచెట్లు, అరుదైన వన్య ప్రాణులతో ఇక్కడ ఉన్న ప్రకృతి అందాలు చాలా అద్భుతంగా ఉంటాయి. సినిమా షూటింగ్‌లూ జరుగుతున్నాయి. ఈ బీచ్‌కు 3 కిలోమీటర్ల దూరంలోనే హంసలదీవి ఉంది.
సూచన బోర్డులు లేకే .. చాలామంది మరణిస్తున్నారు


సెలవు రోజుల్లో ఒక్కో రోజుకు సుమారు 2 వేల మంది పర్యటకులు వస్తారు. సాగర సంగమం వద్ద సూచిక బోర్డుల్లేక నదిలో దిగి చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఇక్కడ సముద్రం చాలా ఉద్దృతంగా ఉంటుంది. 5 అడుగుల దూరంలో 50 అడుగుల లోతు ఉంటుంది. ఇక్కడ దిగితే బ్రతకడం చాలా కష్టం.

మాకు రక్షణ కల్పించండి..


తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో మత్స్యకారులే ప్రాణాలకు తెగించి సందర్శకులను రక్షిస్తుంటారు. గత పదేళ్లలో ఇప్పటికి సుమారు 15 మందికిపైగా చనిపోయారు. వందల మందిని అక్కడే ఉండే మత్స్యకారులు రక్షించారు. ఈ ప్రయత్నంలో తమ ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందంటున్నారు జాలర్లు. అగ్నిమాపక, మెరైన్ శాఖ ద్వారా తమకు లైఫ్‌జాకెట్స్, రింగ్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ప్రమాదం జరిగే ప్రాంతాల వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని పర్యటకులు కోరుతున్నారు.

పర్యటకులకు మేం రక్ష... మాకు రక్ష ఎవరు?

ఇదీచూడండి. సేంద్రీయ బెల్లం... ఆరోగ్యం పదిలం..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details