తెలంగాణలోని నల్గొండ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. పట్టణంలోని జూబ్లీహిల్స్ కాలనీకి చెందిన ప్రసన్న రాణి.. తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడనే కక్షతో రెండో భార్య పిల్లలను ఉరివేసి హత్యచేసింది. తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంది. రెండో పెళ్లి చేసుకుని తనను వదిలేశాడని.. భర్త ప్రదీప్‌పై కోపంతో ఘాతుకానికి పాల్పడుతున్నట్లు ప్రసన్నరాణి ఆత్మహత్య లేఖలో పేర్కొంది. మృతులను ప్రసన్న రాణి (45), మేఘన (6), రుచరి(4)గా గుర్తించారు.
తెలంగాణ: సవతి పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ - తెలంగాణ నేర వార్తలు
తన భర్త రెండో పెళ్లి చూసుకున్నాడన్న కోపంతో రెండో భార్య పిల్లలను ఉరివేసి హత్యచేసింది. తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తెలంగాణ నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగింది.

తెలంగాణ: రెండో భార్య పిల్లలను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న మొదటి భార్య