ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడకు నేడు మెుదటి ప్రయాణికుల రైలు - విజయవాడకు మెుదటి ప్రయాణికుల రైలు

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్​డౌన్ విధించటంతో అన్ని రవాణా సదుపాయాలు పూర్తిగా ఆగిపోయాయి. కేంద్ర ప్రభుత్వ సడలింపుల తర్వాత విజయవాడకు తొలిసారిగా ప్రయాణికులతో రైలు నేడు విజయవాడ రైల్వే స్టేషన్​కు చేరుకోనుంది.

first passenger trian to vijayawada
విజయవాడకు మెుదటి ప్రయాణికుల రైలు

By

Published : May 14, 2020, 11:26 AM IST

లాక్​డౌన్ సమయంలో నేడు విజయవాడకు తొలి ప్రయాణికుల రైలు స్టేషన్​కు చేరుకోనుంది. న్యూదిల్లీ - చెన్నై ఎక్స్​ప్రెస్ ప్రత్యేక రైలు మధ్యాహ్నం 2.30 గంటలకు 250 మంది ప్రయాణికులతో విజయవాడకు రానుంది. ప్రయాణికులందరికీ పరీక్షలు నిర్వహించిన తరువాతే ప్రత్యేక బస్సుల్లో క్వారంటైన్​ కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేశారు.

ఇదే రైలులో విజయవాడ నుంచి చైన్నైకు 300 మంది వలస కూలీలను తరలించనున్నారు. చైన్నై వెళ్లే ప్రయాణికులు గంట ముందుగానే స్టేషన్​కు చేరుకోవాలని అధికారులు ఆదేశించారు. రిజర్వేషన్ చేయించుకున్న వారిని మాత్రమే స్టేషన్​ లోపలికి అనుమతించనున్నారు.

ఇదీ చదవండి:పాత్రికేయులపై చిటింగ్ కేసు... ఎందుకో తెలుసా??

ABOUT THE AUTHOR

...view details