కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం రామవరప్పాడులో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. రామవరప్పాడుకు చెందిన ఓ కానిస్టేబుల్‌కు వైరస్ సోకింది. బాధితుడిని చిన్న అవుటపల్లిలోని పిన్నమనేని వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అప్రమత్తమైన అధికారులు పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేశారు. రామవరప్పాడులో లాక్ డౌన్ ను మరింత కఠినం చేస్తున్నారు.
రామవరప్పాడులో తొలి కరోనా పాజిటివ్ కేసు - విజయవాడలో కరోనా తాజా వార్తలు
విజయవాడ పట్టణంలో భాగమైన రామవరప్పాడులో ఓ కానిస్టేబుల్‌కు కరోనా సోకంది. ఆ ప్రాంతంలో ఇదే తొలి కేసు కావడంపై.. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లాక్ డౌన్‌ను మరింత పటిష్టంగా అమలుచేస్తూ.. పారిశుద్ధ్య పనులను సిబ్బంది ముమ్మరం చేశారు.
రామవరప్పాడులో తొలి కరోనా పాజిటివ్ కేసు