ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్కడ తొలికేసు..ఆయనను కించపరిచినందుకే! - విజయవాడ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ వైకాపా అభ్యర్థి గురుమూర్తి కేసు వార్తలు

తిరుపతి లోకసభ వైకాపా అభ్యర్థిని కించపరుస్తూ పోస్టులు పెట్టిన వారిపై విజయవాడ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఏర్పడిన తరువాత తొలికేసు ఇదే కావటం విశేషం

vijayawada cyber crime police station
విజయవాడ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్​లో మొదటి కేసు

By

Published : Apr 11, 2021, 7:38 AM IST

తిరుపతి లోకసభ వైకాపా అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని కించపరుస్తూ పోస్ట్ పెట్టిన వారిపై విజయవాడ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఏర్పడిన తరువాత తొలికేసు ఇదే కావటం విశేషం. తెదేపా ఫేస్​బుక్ పేజీతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ గురుమూర్తిని కించపరుస్తూ కొంత మంది ట్రోల్ చేస్తున్నారంటూ వైకాపా ఎంపీ నందిగం సురేష్ , ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున , కె . అనిల్ కుమార్​లు డీజీపీ గౌతమ్ సవాంగ్​ను శుక్రవారం కలుసుకుని ఫిర్యాదు చేశారు.

దీంతో ఆయన ఈ కేసును విచారణ నిమిత్తం విజయవాడ పోలీస్ కమిషనర్ బి . శ్రీనివాసులుకు డీజీపీ పంపించారు. సీపీ ఆదేశాల మేరకు సైబర్ క్రైం పోలీసులు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఐపీ చిరునామాల ఆధారంగా సైబర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి.తిరుపతి ఉపపోరు: ఈసీకి తెదేపా లేఖ.. వైకాపాపై ఫిర్యాదు చేసిన అంశాలివే..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details