కృష్ణా జిల్లా నందిగామ పట్టణలోని భారత్ టాకీస్ సెంటర్లో లక్ష్మి త్రివేణి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్లో నుంచి మంటలు వచ్చాయి. అగ్ని ప్రమాదంలో కొంత ఫర్నిచర్ దగ్దమైంది. వెంటనే అప్రమత్తమైన ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలంనికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఎవరికీ ఏ విధమైన ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హోటళ్లలో వంట చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని.. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లు మాత్రం వాడవద్దని.. అలాంటి సిలిండర్లు వాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు.