ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

FIRE IN LORRY: లారీలో చేలరేగిన మంటలు...తప్పిన పెను ప్రమాదం - కృష్ణాజిల్లా ముఖ్యంశాలు

కృష్ణాజిల్లా కంచికచర్ల మండలంలో శనివారం తెల్లవారుజామున రన్నింగ్​లో ఉన్న లారీలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. వారు మంటలను అదుపులోకి తెచ్చారు.

లారీలో చేలరేగిన మంటలు
లారీలో చేలరేగిన మంటలు

By

Published : Jul 17, 2021, 3:18 PM IST


కృష్ణా జిల్లా కంచికచర్ల మండల పరిధిలోని పరిటాల, దొనబండ సరిహద్దు చెక్​పోస్టు వద్ద శనివారం తెల్లవారుజామున రన్నింగ్​లో లారీలో అగ్ని ప్రమాదం తలెత్తింది. దోనబండ కనకదుర్గ క్రషర్​కు చెందిన లారీ ఇంజిన్​లో సాంకేతికలోపం తలెత్తి.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన లారీ డ్రైవర్ కిందకు దూకడంతో పెను ప్రమాదం తప్పింది.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా వారు మంటలు అదుపు చేశారు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు.

ఇదీ చదవండి:

రూ. 2 లక్షలు.. అన్యాయంగా ఎలుకల పాలు!

ABOUT THE AUTHOR

...view details