ఆర్టీసీ బస్సులో మంటలు... ప్రమాద సమయంలో 40 మంది ప్రయాణికులు - కృష్ణా జిల్లా తాజా వార్తలు
09:28 October 21
బస్సు సాంకేతిక లోకం కారణంగానే మంటలు
కృష్ణా జిల్లాలో ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పెదపారుపూడి మండలం పులవర్తి గూడెం వద్ద ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు విజయవాడ నుంచి గుడివాడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పులవర్తిగూడెం సమీపంలో ఉన్నట్లుండి బస్సులో భారీ మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారని స్థానికులు తెలిపారు. మంటలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బస్సు సాంకేతిక లోకం కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని ప్రయాణికులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి: