ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెప్పుల దుకాణంలో అగ్నిప్రమాదం... కారణమేంటి! - కృష్ణా జిల్లాలో అగ్ని ప్రమాదం వార్తలు

బెంజిసర్కిల్‌లోని రిలయన్స్‌ స్టోర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులోని చెప్పుల దుకాణంలోకి మంటలు వ్యాప్తించగా... 60 శాతానికిపైగా కాలిపోయాయి. విద్యుత్​ షార్ట్​ సర్క్యూటే ప్రమాదానికి కారణమని అగ్నిమాపక అధికారులు ప్రాధమిక అంచనా వేశారు.

Fire at Reliance Store at vijayawada in krishna district
విజయవాడ చెప్పుల దుకాణంలో అగ్నిప్రమాదం

By

Published : Jun 11, 2020, 12:36 PM IST

విజయవాడ బెంజిసర్కిల్‌ సమీపంలోని రిలయన్స్‌ దుకాణాల సముదాయంలో అగ్ని ప్రమాదం జరిగింది. బిల్డింగ్‌ మొదటి అంతస్తులోని చెప్పుల దుకాణంలో మంటలు వ్యాపించాయి. సుమారు 60శాతానికిపైగా పాదరక్షలు మంటల్లో కాలిపోయాయి. ఈ సముదాయంలో వస్త్ర దుకాణం.... కార్పొరేట్‌ కార్యాలయంతోపాటు... ఇతర కార్యాలయాలు ఉన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలను ఆర్పే క్రమంలో సిబ్బంది ఒకరికి గాయాలయ్యాయి. విద్యుత్​ షార్ట్​ సర్క్యూటే ప్రమాదానికి కారణమై ఉంటుందని అగ్నిమాపక అధికారులు ప్రాధమికంగా అంచనా వేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘటనా స్థాలాన్ని పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details