ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణలోని పటాన్​చెరు వద్ద రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం - sread

సంగారెడ్డి జిల్లా పటాన్​ చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ రసాయన పరిశ్రమలో ఏర్పడిన మంటలు మరో రెండు పరిశ్రమలకూ వ్యాపించి పూర్తిగా దగ్ధం అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

అగ్నిప్రమాదం

By

Published : Aug 17, 2019, 11:28 AM IST

పటాన్​చెరులోని రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం

సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరు పాశ మైలారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిర్మల ఎంటర్‌ ప్రైజెస్‌ పరిశ్రమలో ఏర్పడిన మంటలు పక్కనే ఉన్న మరో రెండు పరిశ్రమలకి అంటుకోవడంతో ఆ పరిశ్రమలూ పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపు ఐదు అగ్నిమాపక యంత్రాల సహాయంతో అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన ఘటనా పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. రసాయనల పేలుళ్ల శబ్ధంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details