కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముదిరాజుపాలెంలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి.. పూరి గుడిసె అగ్నికి ఆహుతి అయ్యింది. ఇంటి నిర్మాణం కోసం దాచిన రూ.5లక్షల రూపాయలు ఈ ప్రమాదంలో పూర్తి కాలిపోయాయి.
పూరిల్లు దగ్దం.. కాలి బూడిదైన రూ. 5 లక్షలు - gannavaram latest news
కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముదిరాజుపాలెంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరిగుడిసె దగ్ధమైంది. ఈ ఘటనలో ఇంటి నిర్మాణం కోసం దాచిన రూ.5లక్షల రూపాయలు మంటల్లో పూర్తి కాలిపోయాయి.
దుబ్బల వెంకటేశ్వరావు అనే వ్యక్తి.. ప్రస్తుతం నివాసం ఉంటున్న పూరిగుడిసె పక్కన భవనం నిర్మించుకుంటున్నారు. ఉదయం ఇంటి స్లాబు వేసే క్రమంలో అందరూ పనిలో నిమగ్నమయ్యారు. ఇంతలో.. షార్ట్ సర్క్యూట్ కారణంగా.. మంటలు వ్యాపించి పూరిగుడిసె దగ్ధమైంది. ఇంటి నిర్మాణం కోసం దాచిన రూ.5 లక్షల రూపాయలు మంటల్లో కాలిపోయిందని వెంకటేశ్వరావు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపే పూరిగుడిసె మొత్తం అగ్నికి ఆహుతైంది. పోలీసు, రెవెన్యూ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి: మన్యం కొండల్లో పుట్టినందుకు చావాల్సిందేనా..!