ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ కేర్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం.. 10కి చేరిన మృతుల సంఖ్య - swarna pales taja fire broken

విజయవాడలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘటనతో కరోనా రోగులు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్నారు.

విజయవాడ కొవిడ్ కేర్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..  ముగ్గురు మృతి
విజయవాడ కొవిడ్ కేర్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

By

Published : Aug 9, 2020, 7:10 AM IST

Updated : Aug 9, 2020, 2:11 PM IST

విజయవాడ స్వర్ణ ప్యాలెస్​లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కొవిడ్ కేర్ సెంటర్​గా చికిత్స అందిస్తున్న ఈ ప్యాలెస్​లో పొగలు దట్టంగా అలుముకొని... శ్వాస తీసుకోవడంలో బాధితులు ఇబ్బందులు పడ్డారు. కిటికీల్లోంచి కేకలు వేసిన దృశ్యాలు ఆందోళన రేపాయి. ఈ హోటల్‌ను రమేష్‌ ఆస్పత్రి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తోంది. సకాలంలో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. లోపల చిక్కుకున్న వారిని... బయటకు తీసుకొచ్చి ఆంబులెన్సుల ద్వారా.. లబ్బీపేటలోని రమేశ్‌ ఆస్పత్రికి చెందిన మరో సెంటర్‌కు తరలించారు.

ప్యాలెస్​లో 30 మంది వరకు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుండగా... 10 మంది సిబ్బంది వారికి వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. షార్ట్‌సర్క్యూట్‌తో భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌, మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయని సీపీ శ్రీనివాసులు తెలిపారు. ఎన్డీఆర్ ఎఫ్ బృందం సహాయ చర్యల్లో పాల్గొన్నారు.

వేర్వేరు ఆస్పత్రులకు 18 మందిని తరలించినట్లు సీపీ శ్రీనివాసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అగ్నిమాపక, విద్యుత్‌ శాఖల నుంచి సమాచారం తీసుకుంటున్నట్లు తెలిపారు.

విజయవాడ కొవిడ్ కేర్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..

ఇదీ చూడండి

రాష్ట్రంపై కరోనా పడగ... మళ్లీ పది వేలకు పైగా కేసులు

Last Updated : Aug 9, 2020, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details