ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. - fire accident in rtc bus

కృష్ణా జిల్లా కంకిపాడులో ఒక్కసారిగా ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. స్థానిక యువత సహకారంతో ఆర్టీసీ సిబ్బంది.. ప్రయాణికులను కిందకు దింపి మంటలు ఆర్పేశారు.

fire accident in rtc bus
ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. ప్రయాణికులు సురక్షితం

By

Published : Feb 21, 2021, 3:46 AM IST

కృష్ణా జిల్లా కంకిపాడు విజయలక్ష్మి థియేటర్ సమీపంలో ఆర్టీసీ బస్సులో ప్రమాదం జరిగింది. పామర్రు నుంచి విజయవాడ వెళ్తున్న మెట్రో బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

ఇంజన్​లోని విద్యుత్ సంబంధిత లోపంతో ఈ మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు ఏర్పడటంతో భయాందోళనకు గురైన ఆర్టీసీ సిబ్బంది బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. అదే సమయంలో సినిమా హాల్ కూడలిలో ఉన్న యువత బస్సులోని ప్రయాణికులను కిందకు దింపి మంటలను ఆర్పారు. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details