విజయవాడ శివార్లోని నున్న గ్రామ సమీపంలో కుప్పనూర్చిన వరిచేలకు కొందరు రైతుల నిప్పుపెట్టడంతో... ఆ మంటలు సమీపంలోని ఇళ్లకు వ్యాపించాయి. పాయికాపురం, కొత్తపేటకు చెందిన అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకొని మంటలు ఆర్పివేశారు. ఊరికి ఆనుకొని ఉన్న వరిచేలకి ప్రతి ఏడాది పంట కోత ఐపోగానే ఇలా నిప్పు పెట్టడంతో పెద్దఎత్తున పొగ, మసి వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా మని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
వరి పొలంలో మంటలు... ఇళ్లు దగ్ధం
కృష్ణా జిల్లా నున్న సమీపంలో కుప్పనూర్చిన వరి పొలంలో రైతులు నిప్పు పెట్టడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. పక్కన ఉన్న ఇళ్లకు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేశారు.
పొలంలో అగ్నిప్రమాదం