హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న.. గరుడ ఏసీ బస్సులో అకస్మాతుగా మంటలు చెలరేగాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు సమీపంలో.. ఏపీఎస్ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది.
బస్సులో చెలరేగిన మంటలు..డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం - గరికపాడు చెక్‌పోస్ట్ సమీపంలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం
ఏపీఎస్ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు వద్ద బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్.. అందుబాటులోని అగ్నిమాపక పరికరంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చాడు.
![బస్సులో చెలరేగిన మంటలు..డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం fire accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9617489-655-9617489-1605959990709.jpg)
మంటలు చెలరేగిన బస్సు
అప్రమత్తమైన డ్రైవర్.. బస్సులో ప్రయాణికులను వెంటనే కిందికి దింపాడు. వాహనంలోని అగ్నిమాపక పరికరంతో.. పొగ, మంటలను అదుపులోకి తీసుకువచ్చాడు. అనంతరం ప్రయాణికులను మరో బస్సులో అక్కడినుంచి పంపించాడు.
ఇదీ చదవండి:రెండు లారీలు-కారు ఢీ.. క్యాబిన్లో ఇరుక్కున్న లారీ డ్రైవర్లు