ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కనకదుర్గ ఆలయం లడ్డూ తయారీ కేంద్రంలో పేలిన గ్యాస్​ పొయ్యి - fire accident vijayawada latest news

విజయవాడ కనకదుర్గ ఆలయంలో పేలుడు సంభవించింది. లడ్డూ తయారీ కేంద్రంలో గ్యాస్​ పొయ్యి పేలడంతో ఒక్కసారిగా కార్మికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.

fire accident latest news
లడ్డు తయారీ కేంద్రంలో పేలిన గ్యాస్​ పొయ్యి

By

Published : Mar 18, 2021, 6:08 PM IST

విజయవాడ కనకదుర్గ ఆలయంలోని లడ్డూ తయారీ కేంద్రంలో గ్యాస్ పొయ్యి పేలింది. లడ్డూ తయారు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పొయ్యి పేలడంతో కార్మికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో దుర్గ అనే కార్మికురాలికి స్వల్ప గాయాలయ్యాయి.

ఈవో సురేష్ బాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్యాస్ పొయ్యి పైపు లీక్ అవడంతో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగిందని.. వెంటనే సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పిందని ఈవో తెలిపారు. గాయపడిన మహిళకు ప్రథమ చికిత్స చేసిన తర్వాత ఆమె తిరిగి విధుల్లో పాల్గొన్నారని, ఎటువంటి నష్టం కానీ జరగలేదన్నారు.

ఇదీ చదవండి:విజయవాడ మేయర్‌గా రాయన భాగ్యలక్ష్మి

ABOUT THE AUTHOR

...view details