విజయవాడ నగర శివారులోని అజిత్సింగ్ నగర్ ఎక్సెల్ చెత్తప్లాంట్‌లో గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకు నిప్పు పెట్టటంతో.. అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగ వ్యాపించటంతో చుట్టుపక్కల వారు ఇబ్బందులు పడుతున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యాభై మంది సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆకతాయిలు చెత్తకు నిప్పుపెట్టే దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయని పోలీసులు తెలిపారు.