కృష్ణాజిల్లా విజయవాడ విద్యాధరపురంలో 39వ డివిజన్ తెదేపా అధ్యక్షుడు కప్పగంతు శివ తెదేపా తరపున సీట్ ఆశించాడు. తెదేపా ఆ సీట్‌ను వేరే వ్యక్తికి కేటాయించడంతో శివ మంత్రి వెల్లంపల్లి సమక్షంలో వైకాపాలో చేరాడు. కానీ మళ్లి తెదేపా సీట్ కేటాయించడంతో తెదేపా తరపున నామినేషన్ వేయడానికి కేంద్రానికి చేరుకోగా వేయకుండా ఇరు పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ ఘర్షణలో కరిమూల్లా అనే వ్యక్తికి గాయలు అయ్యాయి. ఘటనస్థలానికి చేరుకున్న పోలిసులు ఇరు పార్టీ నేతలను సముదాయించారు.
అభ్యర్థి నామినేషన్ వేయకుండా అడ్డుకున్న తెదేపా, వైకాపా నేతలు
తెదేపాలో సీట్ ఇవ్వలేదని వైకాపాలో చేరాడు.. ప్రతిపక్షం నుంచి వచ్చాడని వైకాపా వెంటనే సీట్ ఇచ్చింది. మొదటి నుంచి పార్టీలో ఉంటూ...ఉత్సాహంగా పనిచేశాడనే కృతజ్ఞతతో తెదేపా పిలిచి సీట్ ఇచ్చింది.అంతే వైకాపాను వదిలేసి తిరిగి తెదేపాలో చేరాడు... నామినేషన్ వేసేందుకు కేంద్రానికి చేరుకున్నాడు... మోసం చేశాడంతూ వైకాపా... పార్టీలోంచి వెళ్లిపోయాడని తెదేపా నాయకులు నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు.విజయవాడ విద్యాధరపురంలో జరిగిన ఘటన పూర్తివివరాలవి..
తెదేపా తరుపు నామినేషన్ వేయకుండా అడ్డుకున్న తెదేపా,వైకాపా నేతలు
ఇదీ చూడండివైకాపాలో చేరేందుకు మరో పదిమంది ఎమ్మెల్యేలు సిద్ధం'