కృష్ణా జిల్లా చిల్లకల్లులో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మాటామాటా పెరిగి ఇరువర్గాల వారు కర్రలతో దాడి చేసుకున్నారు. మహిళలు కూడా పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ముగ్గురు కానిస్టేబుళ్లు, ఎస్సైకి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గొడవకు సంబంధించి కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: