ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనాలపై జ్వరాల పగ..కిక్కిరిసిన ప్రభుత్వ ఆసుపత్రులు - వైరల్ జ్వరాలు

జనాలపై జ్వరాలు పగపట్టాయా..అన్నట్టు వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. వాతావరణ మార్పులతో ఇంటిల్లిపాది ప్రభుత్వ, ప్రయివేట్​ ఆసుపత్రుల్లోని చేరగా.. వార్డులన్నీ రద్దీగా మారుతున్నాయి.

వైరల్ జ్వరాలు

By

Published : Sep 14, 2019, 10:50 AM IST

జ్వరాలతో బాధ పడుతున్నజనం

కృష్ణ జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని గ్రామాల ప్రజలు జ్వరాలతో తీవ్రంగా బాధపడుతున్నారు. నూజివీడులోని ప్రభుత్వ ఆసుపత్రి జ్వర పీడితులతో నిండిపోయింది. అక్కడ వైద్యం వీలుకాదని తెలిసిన మరికొందరు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఈ జ్వరాలపై నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు శ్రీకాంత్ స్పందించారు.. వాతావరణంలో గణనీయమైన మార్పులు, పెరుగుతున్న దోమలు, ఈగలు, పరిసరప్రాంతాల్లో అపరిశుభ్రతతో జ్వరాలు వ్యాపిస్తున్నాయని తెలిపారు. జ్వర పీడితులంతా ప్రైవేట్ ఆస్పత్రులు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి వైద్యం చేయించుకోవాలని, ప్రభుత్వం మందులు సరఫరా చేస్తున్నట్లు వివరించారు. నూజివీడు ఏరియా ఆసుపత్రిలో రోజుకి యాభై నుంచి అరవై మంది వైద్యం చేయించుకుంటున్నారని వివరించారు. .
ఇదీ చూడండి :

ABOUT THE AUTHOR

...view details