కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వైద్య అధికారులు ముమ్మరంగా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. అనంతరం వారు చెప్పిన వివరాలు సర్వేలో నమోదు చేస్తున్నారు.
ప్రభుత్వ నియమాల ప్రకారమే..
కరోనా అనుమానిత లక్షణాలున్న వారి వివరాలు సేకరించి, వైద్య అధికారి సుందర్ కుమార్ పర్యవేక్షణలో పునాదిపాడు, గొల్లగూడెం గ్రామాల్లో 85 మందికి ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వం సూచించిన నియమాల ప్రకారమే ప్రజలు కొవిడ్ నియంత్రణ పాటించాలని వైద్య అధికారి సుందర్ కుమార్ కోరారు. బయటకు వచ్చే సమయంలో మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ తరుచూ సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో డాక్టర్ అజ్మత్ తహరా, గొల్లగూడెం సర్పంచ్ నత్తి దుర్గ భవాని, సెక్రటరీ బి.వెంకటేశ్వరరావు, సీనియర్ అసిస్టెంట్ డి. మునిరాజు, హెల్త్ అసిస్టెంట్ రాచమళ్ల శ్యాంప్రసాద్, ఏఎన్‌ఎం హెల్త్ సెక్రటరీలు పి.రాణి, నాగశ్రీ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
ఇవీ చూడండి :సోనూసూద్ ఆక్సిజన్ ప్లాంట్లు.. ఆంధ్రా నుంచే శ్రీకారం