ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CRUEL FATHER: వావి వరసలు మరచి.. కన్న కూతురుపైనే

మానవత్వం మంటగలిసేలా ప్రవర్తించాడు ఓ తండ్రి.. కామంతో కళ్లు మూసుకుపోయి పశువులా ప్రవర్తించాడు.. కన్నకూతురిపైనే దారుణానికి ఒడిగట్టాడు. ఏడాదిన్నర కాలంగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.

rape
rape

By

Published : Sep 12, 2021, 5:36 PM IST

కామంతో కళ్లు మూసుకుపోయి దారుణానికి ఒడిగట్టాడు కన్నతండ్రి. వావి వరసలు మరిచిపోయి కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు.. మానవత్వానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తించిన ఈ ఘటన కృష్ణా జిల్లాలోని అజిత్​సింగ్​నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

కన్న కూతురిపై తండ్రి ఏడాదిన్నర కాలంగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తండ్రి పెట్టే హింసలు తాళలేక కుమార్తె.. తల్లికి విషయం చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి

SUICIDE: అక్కతో పెళ్లి..మరదలితో ప్రేమ..చివరికి..!

ABOUT THE AUTHOR

...view details