ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుటుంబ కలహాలు.. కుమారుడిని దారుణంగా హతమార్చిన తండ్రి! - ఈరోజు విజయవాడ తాజా క్రైమ్ అప్ డేట్స్

కుటుంబ కలహాలతో తండ్రి సహనం కోల్పోయాడు. సొంత కుమారుడినే దారుణంగా కడతేర్చాడు. నిద్రిస్తున్న సమయంలో.. అదును చూసి గొడ్డలితో దాడి చేసి.. చంపేశాడు. తండ్రి దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆ యువకుడు చికిత్స పొందుతూ ప్రాణం విడిచాడు. ఈ ఘటన.. కృష్ణా జిల్లాలో జరిగింది.

father attacked on his son
కన్న కొడుకుపై గొడ్డలితో దాడి చేసిన తండ్రి

By

Published : May 31, 2021, 11:52 AM IST

కుటుంబ గొడవల నేపథ్యంలో.. కృష్ణా జిల్లా బాపులపాడు మంలం పెరికీడులో కన్నకొడుకునే తండ్రి హతమార్చాడు. వ్యవసాయం చేసుకొనే వీరస్వామికి, అతని కుమారుడు శివకృష్ణకు కొన్ని రోజులుగా గొడవలు జరుగుతుండేవి. ఆదివారం సాయంత్రం కుమారుడు నిద్రిస్తుండగా గొడ్డలితో దాడి చేశాడు.

ఈ ఘటనలో శివకృష్ణ తీవ్రంగా గాయపడగా.. తొలుత హనుమాన్ జంక్షన్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యానికి విజయవాడకు తీసుకెళ్తుండగా అతను మరణించాడు. హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details