ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విపణిలోకి వెన్నశాతం తక్కువగా ఉండే పెరుగు - విజయడైరీ తాజా వార్తలు

వెన్న శాతం తక్కువగా ఉండే టోన్డ్ పాలతో నూతనంగా తయారు చేసిన 10 కిలోల పెరుగు బకెట్​ను కృష్ణా మిల్క్ యూనియన్ యాజమాన్యం మార్కెట్​లో విడుదల చేసింది.

విపణిలోకి  వెన్నశాతం తక్కువగా ఉండే పెరుగు
విపణిలోకి వెన్నశాతం తక్కువగా ఉండే పెరుగు

By

Published : Feb 1, 2020, 10:18 PM IST

విపణిలోకి వెన్నశాతం తక్కువగా ఉండే పెరుగు

విజయవాడలో కృష్ణా మిల్క్ యూనియన్ యాజమాన్యం... వెన్న శాతం తక్కువగా ఉండే టోన్డ్ పాలతో నూతనంగా తయారు చేసిన 10 కిలోల పెరుగు బకెట్​ను మార్కెట్​లోకి ప్రవేశపెట్టారు. యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు పెరుగు బకెట్​ను విపణిలోకి విడుదల చేశారు. సామాన్య, మధ్యతరగతి వారికి కూడా విజయ పాల ఉత్పత్తులు అందించాలనే ఉద్దేశంతోనే ఈ పెరుగు బకెట్​ను అందుబాటులోకి తీసుకొచ్చిన్నట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలో మరికొన్ని ఉత్పత్తులు ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు కార్యచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. పాడిరైతులు, వినియోగదారులు తమ సంస్థకు రెండు కళ్లలాంటి వారని అభివర్ణించారు.

ABOUT THE AUTHOR

...view details