కృష్ణా జిల్లా నందిగామలో అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దిల్లీలో నాలుగు రోజుల నుంచి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ చేస్తున్న ఆందోళనకు మద్దతుగా... నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానిక గాంధీ సెంటర్ నుంచి చేపట్టిన ఈ ప్రదర్శనలో.. కాంగ్రెస్, వామపక్ష నాయకులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి రైతులు మోసం చేసిందని రైతు సంఘం నాయకులు విమర్శించారు. దిల్లీలో చేస్తున్న రైతులు ఆందోళనకు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నామన్నారు.