దేశ రాజధానిలో రైతుల చేస్తున్న పోరాటానికి మద్దతుగా మచిలీపట్నం హెడ్ పోస్టాఫీస్ వద్ద రైతు సంఘాలు నిరసన చేపట్టాయి. వివిధ రైతు సంఘ నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో సంఘ నాయకుడు హరిబాబు మాట్లాడుతూ.. వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం దిగి వచ్చే వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
'రైతు ప్రయోజనాలు దెబ్బతీసే చట్టాలు రద్దు చేయాలి' - కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా మచిలీపట్నంలో రైతుల నిరసన న్యూస్
రైతు ప్రయోజనాలను దారుణంగా దెబ్బతీసే వ్యవసాయ చట్టాలను తక్షణం రద్దు చేయాలని రైతు సంఘ నాయకులు డిమాండ్ చేశారు.
!['రైతు ప్రయోజనాలు దెబ్బతీసే చట్టాలు రద్దు చేయాలి' 'రైతు ప్రయోజనాలు దెబ్బతీసే చట్టాలు రద్దు చేయాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9874821-600-9874821-1607944973587.jpg)
'రైతు ప్రయోజనాలు దెబ్బతీసే చట్టాలు రద్దు చేయాలి'